ETV Bharat / state

సునీత లక్ష్మారెడ్డికి మంత్రి ఇంద్రకరణ్​ స్వాగతం

రాష్ట్ర మహిళా కమిషన్​ ఛైర్​ పర్సన్​ సునీత లక్ష్మారెడ్డిని నిర్మల్​ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్​ పర్సన్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి సునీత నిర్మల్​ జిల్లాకు వెళ్లారు. నాగోబా జాతరకు బయలుదేరిన సునీత మార్గమధ్యలో అక్కడ బస చేశారు.

sunitha laxma reddy, minister indrakaran reddy
సునీత లక్ష్మారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి
author img

By

Published : Feb 10, 2021, 1:37 PM IST

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​ పర్సన్​ సునీత లక్ష్మారెడ్డిని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్​ నాగోబా జాతరకు వెళ్తోన్న సునీత.. మార్గమధ్యలో నిర్మల్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో కాసేపు విడిది చేశారు.

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మంత్రి.. ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం బాసర సరస్వతీ దేవి ఆలయాన్ని సునీత దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సాగర్ పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.