తెలంగాణ పోరాటయోధుడు, మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు కొండాలక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు అధికారికంగా బాపూజీ 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసిగా తెలంగాణ సాధనకై ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరు గుర్తుచేసుకోవాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలమని బాపూజీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుందామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి, జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఫేస్బుక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పదా