నిర్మల్ జిల్లాలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవాన్ని బ్లాక్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ అన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. అనంతరం రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.
వారికి వినతిపత్రం...
అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు, డీఈఓ ప్రణితకు వినతి పత్రం అందజేశారు. కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రైవేట్ పాఠశాలలు మూతపడి ఉపాధ్యాయుల ఆర్థిక పరిస్థితులు ఆగమ్యగోచరంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
6 నెలలుగా ఇదే తంతు..
ఆరు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్ అన్సర్ భాష, సహాయ కార్యదర్శి అర్షద్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్, ఉపాధ్యక్షులు లివింగ్స్టన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : టీచర్ల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది: బండి సంజయ్