తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గుర్తించిన ఓడ్ కుల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఓడ్ కులస్థులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన క్యాలెండర్లను ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమం కోసం రిజర్వేషన్లతో పాటు వారి అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ వారి అభివృద్ధి పట్ల దృఢనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.
కొత్తగా గుర్తించిన 13 సంచార కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు పవర్ కైలాష్ మంత్రిని కోరగా.. సానుకూలంగా స్పందించారు. ఓడ్ కుల చరిత్ర, వారు చేసిన పోరాటం క్యాలెండర్‌లో నిక్షిప్తం చేయటంపై వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రామ్ కిషన్ మహారాజ్, ఉపాధ్యక్షులు సాలుంకే శంకర్, మోహిత్ సంతోష్, అంజన్న, జాదవ్ రాజు, విజయ్, సంజు, తిరుపతి, అశోక్, పవర్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక!