నిర్మల్ జిల్లా కేంద్రంలో సుందరీకరణలో భాగంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. మంజూలాపూర్ శివారు ప్రాంతంవైపు నిర్మించే స్వాగత తోరణం స్థలాన్ని పరిశీలించారు. స్వాగత తోరణ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించి త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని 35, 36 వార్డుల్లో రూ.92 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం మంచిర్యాల చౌరస్తాలో జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించి, మొక్కలు నాటారు.
ఇదీ చూడండి: సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువస్తాం: కేటీఆర్