కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని... మాస్కు తప్పనిసరిగా ధరించాలని సోన్ సీఐ జీవన్ రెడ్డి అన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో ఆదివారం అవగాహన కల్పించారు. మహమ్మారిపై రూపొందించిన పాటను గాయకుడు సుదర్శన్ వినిపించారు.
కొవిడ్ నివారణకు ప్రజలు సహకరించారని సీఐ కోరారు. మాస్కు లేకుండా కనిపిస్తే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వినయ్, పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష