నిర్మల్జిల్లాలో ఆర్టీసీ కార్మికులు కళాకారులుగా నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలోని సమ్మె శిబిరం నుంచి శివాజీ చౌక్ వరకు ర్యాలీ చేశారు. మానవహారం నిర్వహించి కళాప్రదర్శన చేపట్టారు. 26 డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు జోక్యంతో తిరిగి సమ్మె శిబిరం వద్దకు వెళ్లిపోయారు.
ఇదీ చూడండి: "డెడ్లైన్లకు భయపడేది లేదు... ఆర్టీసీకి అసలు బోర్డేలేదు"