వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తెలుసుకుని, పాటించాలన్నారు. 32వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు గులాబీ అందించి అభినందించారు. వాహన చోదకులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ జీవన్ రెడ్డి, ఎస్సై ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.