నిర్మల్ జిల్లాలో అమలవుతున్న ఉపాధ్యాయుల ఆన్లైన్ హాజరు విధానాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సభ్యులు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీకి వినతి పత్రం అందజేశారు. ఆన్లైన్ హాజరు విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకట్ రావు కోరారు.
ఇంటర్నెట్ డేటా ఉచితంగా అందించాలని, మొబైల్ పవర్ బ్యాంకులు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యలు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో నాణ్యమైన మాస్కులు, శానిటైజర్లు అందించి, పారిశుద్ధ్య కార్మికుల పునర్నియామకం చేపట్టాలని కలెక్టర్కు ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం విన్నవించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధర్మాజి చందనే, ప్రధాన కార్యదర్శి బి. రాజేశ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు జి.రవిందర్ పాల్గొన్నారు.