నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని మండల పరిషత్తు నూతన కార్యాలయంలో నిర్వహించిన ఉపాధి హామీ ప్రజావేదికలో అక్రమాలు వెలుగు చూశాయి. ముథోల్, బాసర మండలాల్లో 2018-19 సంవత్సరంలో 2.54 కోట్లతో ప్రభుత్వం ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో పనులు చేయక పోయినప్పటికీ... చేసినట్లు రికార్డులు సృష్టించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మిగతా గ్రామాల సాంకేతిక నిపుణులు, క్షేత్రసహాయకులకు నోటీసులు జారీ చేశారు. ముథోల్ సాంకేతిక నిపుణుడు, క్షేత్రసహాయకుడుకి సుమారు 31 వేల జరిమానా విధించారు. 3 లక్షల 3 వేల 791 రూపాయలు రికవరీ చేసినట్లు డీఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇవీ చూడండి: మహారాష్ట్ర గవర్నర్ను కలిసిన సీఎం కేసీఆర్