ప్రమాదంలో గాయపడి ఆర్థిక స్థోమత లేక మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేకపోతున్న ఓ చిన్నారికి హీరో ప్రభాస్ అభిమానులు చేయూతనిచ్చారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన భవిత అనే చిన్నారికి ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది.
చిన్నారి వైద్య చికిత్స కోసం గ్రామానికి చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు బాధిత కుటుంబానికి రూ. 20 వేలు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు వెంకయ్యగారి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు దాసరి రఘుపతి రెడ్డి, ఓజ ఉదయ్, లోలం మనేశ్, తోట ప్రతాప్, నల్ల శ్రీనివాస్, లోలం ముకేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రభాస్