నిర్మల్ జిల్లాలో రోజురోజుకూ కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. కొవిడ్ బారిన పడకుండా చాలా మంది వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ... కొందరి నిర్లక్ష్యం అనేక మందిలో భయాన్ని కలిగిస్తుంది. లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామ శివారులోని రెడ్డికుంట చెరువు సమీపంలో పీపీఈ కిట్లు ప్రత్యక్షమయ్యాయి.
ఉదయం పంట చేన్లకు వెళ్లే వారికి పీపీఈ కిట్లు దర్శనమివ్వగా... భయాందోళనకు గురయ్యారు. ప్రజల్లో ఇప్పటికే కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం వాడేసిన పీపీఈ కిట్లను కాల్చేయకుండా... రోడ్డుపక్కన నిర్లక్ష్యంగా వదిలేయడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.