ETV Bharat / state

జరిమానా వద్దు.. హెల్మెట్ ముద్దు.. అంటున్న పోలీసులు - గంజాల్ టోల్​ప్లాజా వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్

ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ లైసైన్స్, శిరస్త్రాణం ఉంటేనే రోడ్డు మీదకి రావాలని నిర్మల్ జిల్లా సోన్ సర్కిల్ సీఐ జీవన్ రెడ్డి అన్నారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు జరిమానా విధించడానికి బదులుగా.. హెల్మెట్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు.

police special drive on ganjal toll plaza
గంజాల్ టోల్​ప్లాజా వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్
author img

By

Published : May 16, 2021, 3:01 PM IST

నిర్మల్ జిల్లా సొన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్​లు లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులను ఆపి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జరిమానా విధించడానికి బదులుగా అదే డబ్బుతో హెల్మెట్​లు కొనుక్కోవాలని సూచించగా... పలువురు వాహనదారులు పక్కనే ఉన్న దుకాణంలో శిరస్త్రాణాన్ని కొనుగోలు చేశారు.

హెల్మెట్‌ వస్తువు కాదని ప్రాణాన్ని కాపాడే ఆయుధమని సోన్ సర్కిల్ సీఐ జీవన్ రెడ్డి అన్నారు. హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవాల్సి వస్తోందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణాన్ని ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మామడ ఎస్సై వినయ్, శిక్షణ ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.