ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యమని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు స్పష్టం చేశారు. దిలవర్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గలా సిర్గాపూర్‌లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలులేని 75 ద్విచక్ర వాహనాలు, అనుమతి లేని 3 వేల రూపాయల విలువగల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని కలిగించేందుకే ప్రతీ గ్రామంలో నిర్బంధ తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చుకుంటే నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఊళ్లల్లోకి అనుమానితులు ఎవరైనా వచ్చినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు.