ETV Bharat / state

నిర్మల్​లో రూ.15 లక్షల విలువగల గుట్కా పట్టివేత - గంజాల్​ టోల్​ప్లాజా వద్ద గుట్కా పట్టివేత

నిర్మల్​ జిల్లాలో భారీ మొత్తంలో గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాల్​ టోల్​ప్లాజా సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా ఓ వాహనంలో ఆహార ప్యాకెట్ల చాటున తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ శశిధర్​ రాజు తెలిపారు.

15 lakhs wroth gutka seized in nirmal
నిర్మల్​లో రూ.15 లక్షల విలువగల గుట్కా పట్టివేత
author img

By

Published : May 18, 2020, 4:13 PM IST

ఆహార డబ్బాల మాటున తరలిస్తున్న రూ.15లక్షల విలువైన నిషేధిత గుట్కాను నిర్మల్ జిల్లా సొన్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి సొన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా... కర్ణాటక నుండి ఛత్తీస్​గఢ్​ వైపు వెళ్తున్న ఐషర్​ వాహనాన్ని తనిఖీ చేయగా ఆహార​ డబ్బాలున్నాయి. వాహనంలో పొగాకు వాసన రావడం వల్ల అనుమానమొచ్చిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా డబ్బాల చాటున 70భారీ సంచుల్లో గుట్కాను తరలిస్తున్నట్లు గుర్తించారు.

వాహన డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారించగా... బెంగళూరుకు చెందిన వాహన యజమాని ఇర్షాద్ అహ్మద్ ఖాన్.. గుట్కా ప్యాకెట్లను సంచుల్లో నింపి పంపాడని... హైదరాబాద్​లో ఆహార డబ్బాలు వేసుకుని ఛత్తీస్​గఢ్​ వెళ్లమన్నట్లు తెలిపాడు. డ్రైవర్​ సమాచారంతో వాహన యజమానిపై కేసు నమోదు చేసుకుని యజమానిని తీసుకొచ్చేందుకు బెంగళూరుకు బృందాన్ని పంపినట్లు జిల్లా ఎస్పీ శశిధర్​ రాజు తెలిపారు.

ఇదీ చదవండి:ఆస్తి కోసం బాబాయిని నడిరోడ్డుపై నరికేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.