నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముధోల్ గ్రామపంచాయతీ ఈవో దుర్మరణం పాలయ్యారు. ఖానాపూర్కు చెందిన మనోజ్ కుమార్ విధుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై భైంసా వైపు వస్తుండగా... వానల్పాడ్ వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మనోజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని భైంసా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జగన్.!