కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో కాలనీ వాసులంతా అప్రమత్తంగా ఉండాలని కౌన్సిలర్ కత్తి నరేందర్ సూచించారు. నిర్మల్ పట్టణం బుధవార పేటలో.. ఆయన హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
మహమ్మారి పట్ల ప్రజలు భయాందోళనలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నరేందర్. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వైద్య పరీక్షలు, ప్రసవాలు