పోలీస్ శాఖకు వెలలేని సేవలందించిన ఉత్తముడు.. పోలీస్ ఉన్నతాధికారి, జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ దక్షిణమూర్తి మరణం పోలీస్ శాఖకు తీరని లోటని నిర్మల్ జిల్లా ఎస్పీ రాంరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు.. అన్ని పోలీస్ స్టేషన్లలో దివంగత దక్షిణమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించినట్లు ఎస్పీ రాంరెడ్డి తెలిపారు.
దక్షిణమూర్తి జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో సుదీర్ఘంగా పని చేశారని, మేడారం జాతరకు ప్రత్యేక అధికారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ వెంకట శేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్