నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంగళవారం నిర్వహించే గణేశ్ నిమజ్జనానికి పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సుమారు 600 వందల మంది పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు. ఇవాళ భైంసా పట్టణంలో పోలీసులు, ప్రత్యేక బలగాలు కవాతు నిర్వహించాయి. ముందు జాగ్రత్త చర్యగా పట్టణం మొత్తం బలగాలు మోహరించామని ఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి