ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు - caste
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల వివక్షపై పోరాడిన గొప్ప మహనీయుడని కీర్తించారు.
జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు
కుల అణచివేతలపై పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్‌రాం అని జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బాబు జగ్జీవన్‌రాం 112వ జయంతివేడుకలకు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ తర్వాత కులవివక్షపై పోరాడిన గొప్ప నాయకుడు జగ్జీవన్ రాం అని కీర్తించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎస్పీ సూచించారు.
ఇవీ చూడండి: దేశం దశ.. దిశ మారుద్దాం: కేసీఆర్
sample description