ETV Bharat / state

రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి: నిర్మల్​ డీఎస్పీ - నిర్మల్​ డీఎస్పీ ఉపేంద్రారెడ్డి తాజావార్తలు

వివిధ కారణాలతో రౌడీషీటర్లుగా మారిన వారంతా తమ ప్రవర్తనను మార్చుకొని శాంతియుత జీవనం గడపాలని నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రారెడ్డి పేర్కొన్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Nirmal DSP Upendra reddy Meeting Rowdy Sheters
ప్రవర్తన మార్చుకొని శాంతియుత జీవనం గడపాలి
author img

By

Published : Jul 9, 2020, 11:57 PM IST

నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్​లో రౌడీషీటర్లతో జిల్లా డీఎస్పీ ఉపేంద్రారెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. గొడవలకు, ఆందోళనలకు దూరంగా ఉండాలని సూచించారు. రౌడీషీట్ నమోదైన వ్యక్తులపై నిరంతర నిఘా ఉంటుందని, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకున్నా... వారిపై విచారణ జరపాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ఇది అన్ని రకాలుగా ఇబ్బందికరంగా ఉంటుందని... అందుకే కుటుంబసభ్యులతో ఆనందంగా కలసిమెలసి జీవించాలని సూచించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ జాన్ దివాకర్, సిబ్బంది పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.