ETV Bharat / state

'ఈనెల ఆఖరి వరకు కొనుగోలు పూర్తి చేయాలి' - Nirmal District Collector Musharraf Ali Farooqi review on grain purchase

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తహసీల్దార్, ఎంపీడీవో, అధికారులతో కలెక్టర్​ ముషారఫ్ అలీ ఫౌరూఖీ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల ఆఖరివరకు వరిధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

Collector review
Collector review
author img

By

Published : May 20, 2021, 8:09 PM IST

ఈనెల ఆఖరివరకు వరిధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్​ ముషారఫ్ అలీ ఫౌరూఖీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తహసీల్దార్, ఎంపీడీవో, అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

వరిధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించి... రోజువారి నివేదికను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా సోన్​, నిర్మల్ , సారంగాపూర్​ మండలాల్లో ఇబ్బందులు తలెత్తున్నాయని పేర్కొన్నారు. లారీలు అందుబాటులో లేనట్లయితే ట్రాక్టర్ల సహాయంతో ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేయాలని సూచించారు. గన్ని బ్యాగులు అన్ని కేంద్రాలకు పంపించడం జరిగిందని, ఎక్కడ కొరత లేదని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్యాబ్​లో ఎంట్రీ చేయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్లే గ్రౌండ్ కోసం రెండు ఎకరాల భూమిని గుర్తించాలని సూచించారు.

ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.