ETV Bharat / state

'జులై 31 నాటికి అన్ని శాఖలు హరితహారం లక్ష్యాన్ని పూర్తిచేయాలి'

నిర్మల్​ జిల్లాలో హరితహారం అమలుపై కలెక్టర్​ ముషారఫ్​ ఫారూఖీ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. జులై 31 నాటికి అన్ని శాఖలు తమ లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు.

nirmal district collector musharaf farukee review meeting on haritha haaram

author img

By

Published : Jul 9, 2020, 5:56 PM IST

హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో హరితహారం అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.

ఆరో విడత హరితహారంలో జిల్లా లక్ష్యం 68.9 లక్షలు కాగా... జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నర్సరీల్లో 35 లక్షలు, అటవీ శాఖ నర్సరీల్లో 17 లక్షలు, మున్సిపల్ శాఖ నర్సరీల్లో 9 లక్షలు, జిల్లా ఉద్యానవన శాఖ నర్సరీల్లో 2 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, అటవీ శాఖ ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. రహదారులతోపాటు గ్రామాల్లోని అంతర్గత రోడ్ల వెంట మొక్కలు నాటి పచ్చదనం పెంపొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలను ఆన్​లైన్​లో పొందుపర్చాలన్నారు. జులై 31 నాటికి ప్రతి శాఖ లక్ష్యం పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు.

nirmal district collector musharaf farukee review meeting on haritha haaram
'జులై 31 నాటికి అన్ని శాఖలు నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాలి'

ఇదీ చదవండి : ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.