ETV Bharat / state

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: కలెక్టర్​

author img

By

Published : Sep 5, 2020, 11:06 AM IST

పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలని నిర్మల్​ జిల్లా కలెక్టర్​ ముషారఫ్​ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కూలీల సంఖ్యను పెంచి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పనుల పురోగతిని ప్రతి రోజు పర్యవేక్షించాలన్నారు.

nirmal collector review on development works
అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: నిర్మల్​ కలెక్టర్​

పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా పాలానాధికారి ముషారఫ్ అలీ​ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్​లో పల్లె ప్రగతి పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మండల, గ్రామాల వారీగా నిర్మాణంలోనున్న పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన స్మశాన వాటికలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాల పనులను అధికారులు, సర్పంచుల సమన్వయంతో వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. కూలీల సంఖ్యను పెంచి త్వరతగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలన్నారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని సూచించారు. ఆరో విడత హరితహారంలో శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు వందశాతం మొక్కలు నాటాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పనుల పురోగతిని ప్రతి రోజు పర్యవేక్షించాలని సూచించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రావు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గూడూరు దాతృత్వం... ప్లాస్మాదానం.. అడిగిన వారందరికీ సాయం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.