ప్రతి పాఠశాల పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో.. విద్యాసంస్థల ప్రారంభం, చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ప్రభుత్వ ఆదేశాలతో..
లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వ ఆదేశాలతో .. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని కలెక్టర్ ముషర్రఫ్ స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి పాఠశాల, సంక్షేమ శాఖల వసతి గృహాలు, కళాశాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కఠిన చర్యలు ..
ప్రతిరోజు విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులు ప్రతి పాఠశాలను పర్యవేక్షించి మౌలిక వసతుల కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే.. కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి:టీకా లబ్ధిదారులతో శుక్రవారం మోదీ మాటామంతి