ETV Bharat / state

ఆస్తిపన్నులు వందశాతం వసూలు చేయండి: కలెక్టర్

పట్టణాల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ, పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

Nirmal collector Musharraf Farooqi meeting on property tax
ఆస్తిపన్నులు వందశాతం వసూలు చేయండి: కలెక్టర్
author img

By

Published : Nov 5, 2020, 8:03 PM IST

నిర్మల్ జిల్లాలోని పట్టణాల్లో ఆస్తిపన్ను వందశాతం వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్​ ఫారూఖీ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆస్తిపన్ను వసూలు, పారిశుద్ధ్య నిర్వహణ, పట్టణ ప్రగతి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయడంతో పాటు... పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరిసరాల పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి... త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటినుంచి తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని సూచించారు. పట్టణ పార్కుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని... ప్రతి వార్డులో ట్రీ పార్క్ నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన వ్యాపార సముదాయాలలో ప్రతి నెల అద్దె వసూలు చేయాలని తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న లే ఔట్లను, భవనాలను నిలిపివేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్​ ఫారూఖీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.