ETV Bharat / state

అన్యకులస్థుల క్షౌర దుకాణాలను తొలగించాలని ఆందోళన - తెలంగాణ వార్తలు

తమ కులవృత్తిని కాపాడాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్​ ముందు నాయిబ్రాహ్మణ కులస్థులు నిరసనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. కార్పొరేట్ క్షౌరశాలలను తొలగించాలని డిమాండ్ చేశారు.

nayibrahmins protest at nirmal district collectorate
అన్యకులస్థుల క్షౌర దుకాణాలను తొలగించాలని ఆందోళన
author img

By

Published : Feb 11, 2021, 4:15 PM IST

తరతరాలుగా కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నాయిబ్రాహ్మణ వృత్తిలోకి అన్యకులస్థులు వచ్చి తమ పొట్టకొడుతున్నారని ఆ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు సమ్మెట దశరథ్ అన్నారు. తమ వృత్తిని కాపాడాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్​ ముందు నాయిబ్రాహ్మణ వర్గం ఆందోళన చేపట్టింది. అన్యకులస్థుల క్షౌర దుకాణాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

గీత కార్మికులకు, గంగపుత్రులకు కులవృత్తిపై ఎలాగైతే పేటెంట్ హక్కులు కల్పించారో.. తమకూ పేటెంట్ హక్కు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఎక్కువ శాతం ప్రజలు తమ కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకి పెద్దపీట వేస్తామని చెబుతూ.. నాయిబ్రాహ్మణులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

ఇదీ చూడండి: 'అన్ని పార్టీలతో కలసి నగరాన్ని అభివృద్ధి చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.