నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ కార్యాలయం ఎదుట పురావస్తుశాఖ స్థలంలోని కంచెను తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ముందు ముస్లింలు రాస్తారోకో చేపట్టారు. మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాస్తారోకో చేపట్టడంతో రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ జోక్యం చేసుకొని ఆందోళన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కలెక్టర్ హామీతో..
ఎంతకూ వారు వినకపోవడంతో.. రెండు రోజుల్లో పురావస్తు శాఖ అధికారులతో సర్వే చేయించి సమస్య పరిష్కారిస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో.. మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ సాజీద్, కౌన్సిలర్లు సయ్యద్ సలీం, తౌహిద్ ఉద్దిన్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ అజీంబీన్ యహియా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడికి గురుకులాల పీఈటీ అభ్యర్థుల యత్నం