నిర్మల్ జిల్లా భైంసాలో భాజపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై... మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేసారు. పట్టణంలోని 26 వార్డుల్లో అభ్యర్థులను బరిలో దింపనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.
కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా పని చేసి మున్సిపలిటీలో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను పట్టికోవడం లేదని... జిల్లా అధ్యక్షురాలు, ముథోల్ ఇన్ఛార్జి రమాదేవిపై కొంతమంది ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
ఇవీచూడండి: కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి