ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల ఆయన మద్దతు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగించే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేదని పేర్కొన్నారు. కార్మికులు సమ్మె నోటీసు నెల రోజుల ముందు ఇచ్చారని... కానీ ముఖ్యమంత్రి మొండి వైఖరి వల్లే వారు సమ్మె కొనసాగించాల్సి వస్తోందన్నారు. సీఎం పనికి రాని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మితేనే రాష్ట్రం ముందుకు సాగుతుందని భావించిన కేసీఆర్... ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ పాలన కాకుండా దొరల పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడాలని సోయం బాపూరావు సూచించారు. ఆర్టీసీ రాష్ట్రానికి ఒక గుండె కాయలాంటిదని... ఆ విషయం తెసుకుంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు.
ఇవీ చూడండి: హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతోంది: కేటీఆర్