ETV Bharat / state

Monkeys Attack on people : మితిమీరిన కోతుల ఆగడాలు.. చెట్లు నరికేస్తున్న ప్రజలు - కోతుల ఆగడాలు

Monkeys Attack on people : కోతి చేష్టలు.. చూడటానికి వినోదంగా ఉంటాయి కానీ, వాటి ఆగడాలు భరించలేక గ్రామీణ, పట్టణవాసులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల గ్రామాల్లో ఇప్పుడు ప్రధాన సమస్య కోతులే. మర్కటాల మితిమీరిన వేషాలు తట్టుకోలేక పచ్చని చెట్లను నిలువునా నరికేసుకుంటున్నారు. చెట్ల తొలగింపునకు అనుమతి ఇవ్వాలంటూ అటవీశాఖకు వేల దరఖాస్తులు వస్తున్నాయి. పలుచోట్ల రైతులు ఆరుతడి పంటలను వదిలి వరి వైపు మళ్లుతున్నారు. ఓ వైపు వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెబుతోందని.. మరోవైపు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలంటే కోతుల భయం వెంటాడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Monkeys Attack on people
Monkeys Attack on people
author img

By

Published : Dec 24, 2021, 9:41 AM IST

Updated : Dec 24, 2021, 10:02 AM IST

Monkeys Attack on people : అడవుల్లో ఉండాల్సిన కోతులు జనారణ్యాల్లోకి ప్రవేశించాయి. అటవీ ప్రాంతాల్లో పండ్ల చెట్లు లేకపోవడంతో ఆకలి బాధలు భరించలేక గ్రామాలు, పట్టణాల్లోకి అవి మకాం మార్చాయి. ఓ వైపు పంటలను నాశనం చేయడంతోపాటు మరోవైపు ఇళ్లలో చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. రహదారులపైనా స్వైరవిహారం చేస్తున్నాయి.

సోన్‌లో 3 వేల ఎకరాల సాగుపై కోతుల ప్రభావం

Monkey Attack in Nirmal : నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలో మొత్తం 14 వేల ఎకరాలకుగాను 10 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగయ్యేవి. ఆరేళ్ల నుంచి కోతుల బెడద[ ఎక్కువైంది. పలువురు ప్రత్యామ్నాయంగా వరి వైపు వెళ్లారు. దీంతో వరి సాగు నాలుగు వేల ఎకరాల నుంచి ఏడువేల ఎకరాలకు పెరిగింది.

ఒకటే కేంద్రం.. రోజుకొక్క శస్త్రచికిత్సే

Monkey Troubles People : దక్షిణాదిలోనే తొలిసారి నిర్మల్‌ పట్టణంలో ఏర్పాటుచేసిన కోతుల పునరావాస, సంరక్షణ కేంద్రంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. 2020 అక్టోబరు నుంచి ఈ నవంబరు వరకు అందులోకి తీసుకోచ్చింది 724 కోతులనే. అదే సమయంలో ఈ కేంద్రంలో సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు 389 మర్కటాలకే జరిగాయి. అంటే దాదాపుగా రోజుకు ఒక్కదానికే శస్త్రచికిత్స జరిగినట్టు లెక్క. కోతులను పట్టుకోవడానికి, తరలించడానికి నిధులు, రవాణాలో దూరభారం ప్రధాన సమస్యగా మారాయి. ఉమ్మడి జిల్లాకు కనీసం ఒక్కటైనా ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. మరోవైపు పలు రకాల పండ్ల చెట్లతో జగిత్యాల, కరీంనగర్‌, జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లోని కోతులు అధికంగా ఉన్న గ్రామాల్లో ఏర్పాటుచేసిన మంకీ ఫుడ్‌కోర్టులూ మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలాయి.

పచ్చదనానికి గొడ్డలిపెట్టు

జనగామ జిల్లా చిల్పూరు సమీపంలోని పొలం గట్టుపై చెట్టు నరికివేత

Monkey Attacks People in Telangana : మర్కటాలకు భయపడి పొలాల దగ్గర చెట్లను రైతులు నరికేస్తున్నారు. ‘వాల్టా’ చట్టం ప్రకారం సొంత భూముల్లో చెట్లను నరికేయాలన్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి. చెట్టుకు రూ.500 జరిమానా చెల్లించాలి. ఆర్థికభారమైనా కోతులతో నష్టం ఎక్కువగా ఉండటంతో వెనకాడట్లేదు. జనగామ జిల్లాలో ఏప్రిల్‌-డిసెంబరు మధ్య ఇలా 3,474 దరఖాస్తులు వచ్చాయి. అధికారుల అనుమతితో 2,310 వృక్షాలు గొడ్డలి పెట్టుకు నేలకొరిగాయి. చింత చెట్లకు ప్రసిద్ధిగాంచిన జనగామ జిల్లా జఫర్‌గడ్‌ నుంచి ఒకప్పుడు పది టన్నుల చింతపండు ఎగుమతి అయ్యేది.. ఇప్పుడు అక్కడివారే బయటనుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇక కూరగాయలు, పండ్ల తోటల రైతుల కష్టాలు అన్నీఇన్నీకావు. కోతుల బెడద ఎక్కువ కావడంతో చాలా గ్రామాల్లో పెరటి తోటల సాగు చాలించుకున్నారు. సూర్యాపేట, యాదాద్రి, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల్లోనూ ఈ తరహా పరిస్థితులున్నాయి.

దిక్కు తోచట్లేదు

- మెట్టు పెద్దగంగాధర్‌, సోన్‌

Monkey Attacks People Telangana : నాకు నాలుగెకరాల భూమి ఉంది. మొక్కజొన్న, పెసర్లు సాగుచేసేవాడిని. కోతులు పంట నష్టం చేస్తుండటంతో చేసేదేంలేక వరి పండిస్తున్నా. వేసవిలో వరి వద్దని ప్రభుత్వం అంటోంది. జొన్న, పెసర్లు, శనగలు, మినుములు వేస్తే కోతుల ధ్వంసం చేస్తాయి. ఏ పంట పండించాలో అర్థంకావట్లేదు.

కోతుల బాధకు మిరప సాగు చేశాను

- కోదాటి సుధాకర్‌, రైతు, తుంగతుర్తి

Monkeys Destroys Crops : ఈ సారి ధైర్యం చేసి రెండెకరాల విస్తీర్ణంలో పెసర వేశా. కుటుంబసభ్యులమంతా కాపలా కాసినా పంటను కాపాడుకోలేక పోయాం. ఒక్క గింజ కూడా మిగల్చకుండా కోతులు తినేశాయి. గత్యంతరం లేక ఇప్పుడు మిరప సాగు చేశాను.

ఒక్కో కోతికి అరడజను సంతానం

కోతి జీవితకాలం 15 ఏళ్లు. ఒక్కో ఆడ కోతి సగటున అరడజను పిల్లలను కంటుంది. అటవీప్రాంతాల వెలుపల కోతుల సమస్య ఎక్కువగానే ఉంది. వాటిని పట్టుకోవడానికి, స్టెరిలైజేషన్‌కు, తర్వాత అడవుల్లో వదలిపెట్టడానికి మా శాఖ అనుమతిస్తుంది.

-శంకరన్‌, అటవీ శాఖ ఓఎస్డీ

ఇవీ చదవండి :

Last Updated : Dec 24, 2021, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.