ఔషధగుణాలు ఎక్కువ:
ఈ పూలకు ఔషధగుణాలు ఎక్కువే. హోలీ పండుగకు వీటిని దంచి రసం తీసి నీటిలో కలిపి హోలీగా చల్లుకుంటారు. ఎండాకాలంలో వచ్చే అనారోగ్యాలను దూరంగా ఉంచే గుణాలూ ఈ పూలలో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వీటిని నీటిలో ఉడికించి చక్కెర వేసుకుని సేవిస్తే మూత్రసంబంధిత వ్యాధులు దరిచేరవు. . ఈ పువ్వుల రసం చర్మంపై రాస్తే చర్మవ్యాధులు రావని వైద్యులు చెబుతున్నారు. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా రక్షణ కవచంలా పని చేస్తుంది.
హోలీకి సహజ రంగులే వాడుదాం:
హోలీ పండుగకి ఒకప్పుడు ఈ పూల నుంచి వచ్చే రసాన్ని రంగులుగా వాడేవారు. ప్రస్తుతం వాడుతున్న కృత్రిమ రంగులతో... చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం... ఈసారి తప్పకుండా మోదుగుపూల రంగులతో హోలీ చేసుకుందాం.