నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మొక్కలు నాటారు. మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటి అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో హరితహారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
ప్రకృతి సమస్యలకు పరిష్కారం సాధించాలంటే.. మొక్కలు నాటడం, పచ్చదనాన్ని కాపాడుకోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు.