ETV Bharat / state

ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని అడ్డుకున్న మహిళలు - Nirmal district latest news

నిర్మల్ జిల్లా మలేగమ్ గ్రామంలో రైతువేదికను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. మరో వేదిక ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ఆయన్ను డబుల్​ బెడ్​రూమ్ లబ్ధిదారులు అడ్డుకున్నారు. తమ నుంచి కాంట్రాక్టర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

MLA Vital Reddy inaugurated a farmers' forum in Malegam village in Nirmal district
ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని అడ్డుకున్న డబుల్ బెడ్​రూమ్ లబ్ధిదారులు
author img

By

Published : Feb 17, 2021, 4:13 PM IST

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మలేగమ్ గ్రామంలోని రైతువేదికను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. తిరిగి నిగ్వలోని మరో వేదిక ప్రారంభోత్సవనికి వెళ్తుండగా ఎమ్మెల్యేని డబుల్​ బెడ్​రూమ్ లబ్ధిదారుల మహిళలు అడ్డుకున్నారు.

డబుల్​ బెడ్​రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి నాలుగేళ్లుగా ఇంకా పూర్తి చేయలేదన్నారు. 30 మంది.. ఒక్కొక్కరి నుంచి లక్ష 20 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మొదటి విడతలో 60వేలు ఇచ్చామని.. ఇంకా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు.

డబుల్​ బెడ్​రూమ్ ఇళ్లల్లో కూలీ పనులకు ఉచితంగా వెళ్తున్నామని వాళ్లు చెప్పారు. ప్రభుత్వ భూమి లేదని, లబ్ధిదారుల ఒక్కొక్కరి నుంచి 60వేలు వసూలు చేసి ఓ ప్రైవేటు స్థలాన్ని కొన్నామని కాంట్రాక్టర్ తెలిపారు.

ఇదీ చూడండి: సెటిల్​మెంట్ చేసినా కేసు నుంచి తప్పించుకోలేరు: సుప్రీం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.