నిర్మల్లో భారీవర్షంలోనూ సైతం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ప్రతిఒక్కరూ శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను జరుపుకోవాలని సూచించారు. అందరూ పోలీసుల సూచనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. అనంతరం పోలీసులు ఏర్పాటు చేసిన హెల్మెట్‌పై అవగాహన ఫ్లెక్సీని ఆయన ప్రారంభించారు. అనంతరం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, నిర్వాహకులతో కలిసి మంత్రి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: "శాఖల మధ్య సమన్వయం కొరవడుతోంది"