నిర్మల్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో లిఫ్ట్ ఇరిగేషన్, అటవీ, విద్యుత్ , పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, ఐటీడీఏ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. జిల్లాలో సాగునీటి అభివృద్ధి,, మిషన్ భగీరథ సరఫరా, పైప్ లైన్ మరమ్మతులపై సమీక్షించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లో ఎక్కడ కూడా లీకేజ్ కాకుండా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: మండుతున్న ఎండలు