రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలోని ఎల్లపల్లి ఎంపీటీసీ స్థానానికి ఏకగ్రీవమైనందున... ప్రస్తుతం జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. జడ్పీటీసీ స్థానానికి ఓటేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... ఓటు వేయడం మన హక్కు అని తెలిపారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని సూచించారు.
ఇవీ చూడండి: రెండో విడత పోలింగ్ ప్రారంభం