వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె అని సీఎం కేసీఆర్ ఇచ్చిన నినాదంతో హరితహారం కార్యక్రమంలో మంకీ ఫుడ్ కోర్ట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ గ్రామంలోని మంకీ ఫుడ్ కోర్టులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. తెలంగాణ వ్యాప్తంగా కోతుల కోసం మంకీ ఫుడ్ కోర్టుల్లో ఇష్టంగా తినే పండ్ల చెట్లను పెంచుతున్నామని తెలిపారు. దీనితో కోతులకు సరిపడా ఆహారం దొరుకుతుందని గ్రామాల్లో, పట్టణాల్లో కోతుల సంచారం తగ్గుతుందని పేర్కొన్నారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అడవుల పునరుజ్జీనానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. చెట్లు ఉంటేనే వర్షాలు సకాలంలో కురుస్తాయని ఆయన తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించాలని సూచించారు. నాటిన మొక్కల్లో 85% మొక్కలను బతికించే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:ప్రైవేట్లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్