నిర్మల్ జిల్లా కేంద్రంలోని కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ, సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని... రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు.
దేశంలోనే ఆదిలాబాద్ జిల్లా పత్తికి మంచి పేరు ఉందని... సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు. జిల్లాలో 24 కొనుగోలు కేంద్రాలు ఉండగా... నిర్మల్లో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. రైతులు కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే... నాణ్యత, ప్రమాణాలు కలిగిన పత్తి దిగుబడి వస్తుందని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి: 100 శాతం పత్తి కొనుగోలుకు సీసీఐ హామీ: నిరంజన్ రెడ్డి