కాళేశ్వరం ప్రాజెక్ట్ 27, 28వ ప్యాకేజీ కాలువ పనులు, సదర్మాట్ బ్యారేజీ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో 27, 28వ ప్యాకేజీ, సదర్మాట్ బ్యారేజీ పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులు, ఇంకా చేయాల్సిన పనులపై అధికారులతో చర్చించారు. కావల్సిన నిధుల కోసం సమగ్ర నివేదికను తయారు చేయాలని పేర్కొన్నారు.
రూ. 212.78 కోట్లు అవసరం
కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీ ద్వారా నిర్మల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు, 28వ ప్యాకేజీ ద్వారా ముథోల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు, సదర్మాట్ బ్యారేజీ ద్వారా 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవచ్చని మంత్రి ఇంద్రకరణ్ వెల్లడించారు. వివిధ పనుల కోసం రూ. 212.78 కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్ గౌడ్ తెలిపారు.
ఇదీ చూడండి: ఒకే ఇంట్లో నలుగురికి కరోనా