నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ సమీపంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు మహార్దశ వచ్చిందని మంత్రి అన్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 500పైగా ఆలయాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.
వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ ఛైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, కౌన్సిలర్లు నేరెళ్ల వేణు, అయ్యన్నగారి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పాతగుట్ట బ్రహ్మోత్సవాలు: కన్నుల పండువగా పూర్ణాహుతి, చక్రస్నానం