మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణించాలని జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి అన్నారు. సమాజంలో పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నా ఆక్కడక్కడ వేధింపులు జరగడం చాలా బాధాకర విషయమన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రంలో మహిళ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మాస్ అవగాహన సదస్సు నిర్వహించారు. సఖి కేంద్రం ద్వారా మహిళలకు ఆండగా నిలవడం అభినందనీయమని ఆమె తెలిపారు. మహిళలు చదువుకున్నప్పుడే ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లవచ్చన్నారు.
మహిళల రక్షణ కోసం రూపొందించిన ప్రత్యేక చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల సఖీ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారిణి స్రవంతి, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, ఏఎస్పీ రాంరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, సఖి కేంద్ర నిర్వాహకురాలు మమత, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.