ETV Bharat / state

అందని ద్రాక్షగా మారిన రైతుబంధు

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఇప్పటికీ కొందరికి అందని ద్రాక్షగానే ఉంది. ప్రభుత్వం ఇచ్చిన కొత్త పాసుపుస్తకాలు నేటీకీ చాలామందికి అందలేదు.  పాసు పుస్తకాలపై బ్యాంకుల్లో రుణాలు లభించక.. వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

పట్టా పాసుపుస్తకాలు ఇప్పించండి
author img

By

Published : Apr 2, 2019, 7:34 AM IST

Updated : Apr 2, 2019, 8:00 AM IST

పట్టా పాసుపుస్తకాలు ఇప్పించండి
నిర్మల్​జిల్లా రాణాపూర్​లో 50కి పైగా గిరిజన కుటుంబాలున్నాయి. వీరందరిదీ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.. వ్యవసాయమే జీవనాధారం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన రైతుబంధు వారికి అందని బంధు గానే ఉంది.
గ్రామంలో ఉన్న వారిలో 15 కుటుంబాల వారికి ఇప్పటికీ కొత్త పట్టా పాసుపుస్తకాలు లేవు. కొంతమంది భూములు మరొకరి పేరుపై నమోదు చేశారు. ఈ కారణాలతో వారు రైతుబంధుకు దూరమయ్యారు.

ఇప్పటికైనా స్పందించండి

ప్రభుత్వ సాయం అందకపోగా.. పంటరుణం కోసం బ్యాంకుకు వెళితే అక్కడా చుక్కెదురవుతోంది. బ్యాంకుల్లో పట్టాపాసుపుస్తకాలు ఇవ్వాలి. కాని వారిదగ్గరున్నవి చెల్లుబాటు కావు. నెలల తరబడి కాళ్లరిగేలా తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుబంధు అందక, బ్యాంకు సాయం లభించక సమస్య పరిష్కారం కోసం ఎవరికి విన్నవించుకోవాలో తెలియక గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ భూమికి పాసు పుస్తకాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:ఆందోళనలకు సిద్ధమైన రెవెన్యూ ఉద్యోగులు

పట్టా పాసుపుస్తకాలు ఇప్పించండి
నిర్మల్​జిల్లా రాణాపూర్​లో 50కి పైగా గిరిజన కుటుంబాలున్నాయి. వీరందరిదీ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.. వ్యవసాయమే జీవనాధారం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన రైతుబంధు వారికి అందని బంధు గానే ఉంది.గ్రామంలో ఉన్న వారిలో 15 కుటుంబాల వారికి ఇప్పటికీ కొత్త పట్టా పాసుపుస్తకాలు లేవు. కొంతమంది భూములు మరొకరి పేరుపై నమోదు చేశారు. ఈ కారణాలతో వారు రైతుబంధుకు దూరమయ్యారు.

ఇప్పటికైనా స్పందించండి

ప్రభుత్వ సాయం అందకపోగా.. పంటరుణం కోసం బ్యాంకుకు వెళితే అక్కడా చుక్కెదురవుతోంది. బ్యాంకుల్లో పట్టాపాసుపుస్తకాలు ఇవ్వాలి. కాని వారిదగ్గరున్నవి చెల్లుబాటు కావు. నెలల తరబడి కాళ్లరిగేలా తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుబంధు అందక, బ్యాంకు సాయం లభించక సమస్య పరిష్కారం కోసం ఎవరికి విన్నవించుకోవాలో తెలియక గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ భూమికి పాసు పుస్తకాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:ఆందోళనలకు సిద్ధమైన రెవెన్యూ ఉద్యోగులు

Last Updated : Apr 2, 2019, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.