ETV Bharat / state

ఎన్నికల్లో రెబల్​గా గెలిచింది... ఇబ్బంది పడింది...! - PACS ELECTION NEWS IN TELUGU

ఎన్నికల్లో గెలిచినా... పాట్లు తప్పలేదు ఆ అభ్యర్థికి. ఓ పార్టీ రెబల్​గా దిగిన ఆ మహిళా అభ్యర్థికి... ప్రత్యర్థి పార్టీ మద్దతు తెలిపింది. తీరా గెలిచాకా... ఛైర్మన్​ పదవికి మద్దతివ్వాలంటూ భర్త సమక్షంలోనే ఆ ఇరు పార్టీలు చేసిన హంగామాలో ఇబ్బంది పడటం ఆ అభ్యర్థి వంతైంది.

LADY CONTESTANT TROUBLED IN NIRMAL PACS ELECTIONS

author img

By

Published : Feb 15, 2020, 10:24 PM IST

నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్​ పాడ్​ సహకార సంఘాల ఎన్నికల్లో గెలిచినా సరే... ఓ మహిళా అభ్యర్థి తన భర్త సమక్షంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. సహకార వార్డు సభ్యురాలిగా తెరాస తిరుగుబాటు అభ్యర్థి లావణ్య కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించారు. కుంటాల మండలంలో మొత్తం 13 వార్డులకు గాను తెరాస 6చోట్ల... కాంగ్రెస్ 6చోట్ల గెలిచాయి.

ఛైర్మన్​ పదవి దక్కించుకునేందుకు ఇరు పార్టీల మద్దతుదారులకు లావణ్య మద్దతు తప్పనిసరిగా మారింది. ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి లావణ్య బయటకు రాగానే తెరాస వర్గీయులు బలవంతంగా శిబిరానికి తరలించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వర్గీయులు అడ్డుకునేందుకు యత్నించగా ఉద్రిక్తత నెలకొంది. కేకలు పెడ్తూ.. ఇరు వర్గీయులనుంచి తప్పించుకున్న లావణ్య... భర్త కిష్టయ్య దగ్గరికి చేరింది. అనంతరం కాంగ్రెస్ శిబిరానికి వెళ్లింది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి కూడా అగచాట్లు తప్పడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.

ఎన్నికల్లో గెలిచింది... ఇబ్బంది పడింది...!

ఇవీ చూడండి:శంషాబాద్​లో 1100 గ్రాముల బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.