ETV Bharat / state

సెంట్రల్ కంట్రోల్ రూమ్​ను ప్రారంభించిన ఇంద్రకరణ్ రెడ్డి

విధి నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించడం వల్ల ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్​లోని కలెక్టరేట్​లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ రూమ్​ను ఆయన ప్రారంభించారు.

Indrakaran Reddy opened Central Control Room at nirmal collector office
సెంట్రల్ కంట్రోల్ రూమ్​ను ప్రారంభించిన ఇంద్రకరణ్ రెడ్డి
author img

By

Published : Mar 3, 2020, 1:29 PM IST

నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్​ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి ప్రారంభించారు. ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగుల పర్యటన, విధులకు హాజరవుతున్న సమయం, తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన లైవ్‌ ట్రాకింగ్‌ విధానాన్ని ఆయన పరిశీలించారు.

సెంట్రల్ కంట్రోల్ రూమ్​ను ప్రారంభించిన ఇంద్రకరణ్ రెడ్డి

ఈ విధానానికై పాలనాధికారి తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ విధానం అన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలందుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: అడవిని చదివిన 'తులసి'బామ్మకు పద్మశ్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.