నిర్మల్ జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గాదేవి ఆలయంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా మొట్టమొదటి చీరను అమ్మవారికి సారె రూపంలో సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మహిళలకు సోదరుడు, మేనమామలా సారె రూపంలో బతుకమ్మ చీరలను అందజేస్తున్నారని మంత్రి తెలిపారు. నిర్మల్ జిల్లాలో రెండు లక్షల 59 వేల మందికి పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బస్సు టైర్ పంచర్.. మెట్రో పిల్లర్‌కు ఢీ