ప్రచార హోరు
లక్ష్మణ చాందా, నిర్మల్, దిలావర్పూర్, నర్సాపూర్ మండలాల్లో మంత్రి ప్రచారాన్ని నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన తెరాస కార్యకర్తల సమావేశానికి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాంగ్రెస్ ఖాళీ
ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని మంత్రి అన్నారు. భవిష్యత్తులో హస్తం పార్టీకి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకరని జోస్యం చెప్పారు. తెరాస నుంచి పోటీ చేస్తున్న నగేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందించాలని కార్యకర్తలకు సూచించారు.ఈ సమావేశంలో పలువురు సర్పంచులుతో పాటు ఇతర పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు.
ఇవీ చూడండి:శరత్.... నేను కేసీఆర్‌ను మాట్లాడుతున్నా...!