నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రం శ్రీ విఠలేశ్వరస్వామి జాతరను ఘనంగా నిర్వహించారు. ఎటుచూసినా వీధులన్నీ జనసంద్రంగా మారాయి. మహరాష్ట్రలోని ధర్మాబాద్, నాందేడ్, భోకర్ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రజలు ఉత్సవంలో పెద్దఎత్తున పాల్గొని గ్రామంలోని దేవతామూర్తులకు పూజలు చేశారు.
జాతరలో భాగంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. జిల్లా యువకులతో పాటు మహరాష్ట్ర వాసులు పోటీపడ్డారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.9151, వెండి , ద్వితీయ రూ.7151, వెండి, తృతీయ రూ.5151 నగదుతో పాటు నూతన వస్త్రాలను అందించి సత్కరించారు. జాతరలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.