నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ మహిళతో లాడ్జీలో పట్టుబడ్డ పోలీసుపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కడెం మండలానికి చెందిన ఓ మహిళ హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు వచ్చి స్వగ్రామానికి వెళ్లేందుకు రవాణా సదుపాయం లేక ప్రయాణ ప్రాంగంణంలో వేచి చూస్తోంది. గమనించిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఆమెను మాటల్లో దించి లాడ్జీకి తీసుకెళ్లాడు. వీరి కదలికలను గమనిస్తున్న స్థానికులు వీడియో తీసి పోలీసులకు సమాచారమిచ్చారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: రైలు కింద పడబోతున్న వ్యక్తిని రక్షించాడు