నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారానికి చెందిన ఆకోజి నాగభూషణ్, బొరంతల అశోక్.. బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లారు. లాక్డౌన్ వల్ల గ్రామంలో పనులు లేక నిరుపేదలు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని మిత్రుల ద్వారా తెలుసుకుని చలించిపోయారు.
వెంటనే నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయమని తాము కష్టపడి సంపాదించిన దాంట్లో నుంచి కొంత స్నేహితులకు పంపించారు. నగదు చేరగానే గ్రామంలోని మిత్రులు నిత్యావసర వస్తువులను అందరికీ పంపిణీ చేశారు. ఆపత్కాలంలో అండగా నిలిచిన మిత్ర బృందాన్ని గ్రామస్థులు అభినందించారు.